ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన కలెక్టర్

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లాలో రైతులకు ఎరువులు సమయానికి అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ అమలు తీరును జిల్లా కలెక్టర్ దీపక్ తివారి పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి రాజరత్నం, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశం, (టెక్నికల్) సుందీప్, మరియు మండల వ్యవసాయ అధికారి వికారాబాద్ శ్రీమతి జి. ప్రసన్న లక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో ఎరువుల నిల్వలు, సరఫరా మరియు రైతులకు విక్రయాల వివరాలను యూరియా యాప్ ద్వారా సమీక్షిస్తూ కలెక్టర్ పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా వికారాబాద్‌లోని లక్ష్మీనారాయణ ఏజెన్సీస్ మరియు గుల్షన్ బ్రదర్స్ ఎరువుల డీలర్ అవుట్‌లెట్లను కలెక్టర్ గారు సందర్శించి యూరియా నిల్వలు మరియు విక్రయాల నమోదును పరిశీలించారు
యూరియా యాప్ ఎలా పనిచేస్తుంది ఎరువుల డీలర్లు తమ దుకాణాలలో ఉన్న యూరియా నిల్వలను యాప్‌లో నమోదు చేస్తారూ. రైతులకు విక్రయించే ప్రతి యూరియా సంచిని యాప్‌లో నమోదు చేయడం ద్వారా విక్రయాల వివరాలు నమోదు అవుతాయఈ సమాచారం జిల్లా మరియు రాష్ట్ర స్థాయి అధికారులకు తక్షణమే అందుబాటులో ఉంటుందిదీని ద్వారా ఎరువుల నిల్వలు, సరఫరా పరిస్థితులు మరియు పంపిణీపై సమర్థవంతమైన పర్యవేక్షణ జరుగుతుంది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువుల సరిపడా నిల్వలు ఉండేలా అన్ని డీలర్లు మరియు వ్యవసాయ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎరువుల సరఫరా మరియు పంపిణీపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు. జిల్లాలో ఎరువుల అందుబాటుపై వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తారని తెలిపారు.
