ఈవీఎం గోదాముల్లో కలెక్టర్ తనిఖీ
నెల్లిమర్ల (విజయనగరం), (ఆంధ్ర ప్రభ): ఈవీఎం గోదాములను (EVM Warehouse) విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. షట్టర్లకు వేసిన సీళ్లను తెరిపించి, లోపల గదుల్లో ఉంచిన ఈవీఎంలను పరిశీలించారు. మొత్తం ఏడు నియోజకవర్గాల గదులను తనిఖీ చేశారు. అనంతరం సీళ్లను వేయించారు.
గోదాముల వద్ద భద్రతను సమీక్షించారు. సీసీ కెమెరాలు, టీవీలను పరిశీలించారు. అప్రమత్తుంగా ఉండాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీల్లో ఆర్‌డిఓ డి.కీర్తి, అగ్నిమాపక అధికారి సోమేశ్వరరావు, ఆర్ అండ్ బి ఈఈ జేమ్స్, నెల్లిమర్ల తాహసీల్దార్ శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ జయరామ్, ఎన్నికల సూపరింటిండెంట్ భాస్కర్రావు, ఇతర రెవెన్యూ సిబ్బంది, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


