Collector | ప‌చ్చ‌ద‌నానికి శ్రీ‌కారం…

Collector | ప‌చ్చ‌ద‌నానికి శ్రీ‌కారం…

  • స్వర్ణ ఆంధ్ర –స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా

Collector | గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : పరిశుభ్రమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని గుంటూరు కలెక్టర్ ఏ తమీమ్ అందారియ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం స్వర్ణ ఆంధ్రా–స్వచ్ఛ ఆంధ్రాలో భాగంగా “జీరో లిటర్ గవర్నెన్స్” థీమ్‌తో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మేడికొండూరు మండలం పేరేచర్లలో చురుకుగా పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలిచారు.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పచ్చదనానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్, స్వయంగా చెత్త ఊడ్చి శుభ్రతపై తన నిబద్ధతను చాటిచెప్పారు. ఇంటింటా తడి–పొడి చెత్త వేరు చేసి సేకరించే కార్యక్రమంలో స్వచ్ఛ రథం, గ్రీన్ అంబాసిడర్లతో కలిసి పాల్గొని ప్రజల్లో అవగాహన కల్పించారు.

Collector |

గ్రీన్ అంబాసిడర్లు, స్వచ్ఛ కార్మికులకు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని తనిఖీ చేసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ-వేస్ట్ కలెక్షన్ కౌంటర్‌ను సందర్శించి సేకరణ వివరాలను పరిశీలించారు. గ్రామ వీధుల్లో తిరుగుతూ ప్రజలతో నేరుగా మాట్లాడి శుభ్రతపై చైతన్యం కల్పించారు. పాఠశాల ప్రాంగణంలో సేంద్రియ ఎరువు గుంటకు శంకుస్థాపన చేసి, ప్రతి ఇంట్లో సేంద్రియ ఎరువు తయారీ సాధ్యమని వివరించారు.

Collector |

Collector | శుభ్రత మనందరి బాధ్యత…

కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పది సూత్రాల కార్యక్రమంలో స్వర్ణ ఆంధ్రా స్వచ్ఛ ఆంధ్ర ఒక ముఖ్య భాగమన్నారు. ఉపాధి హామీ పథకంలో సేంద్రియ ఎరువు గుంటలను ఏర్పాటు చేసుకునే అవకాశముందని తెలిపారు. ఇళ్లు, వీధులు, పాఠశాలలు, సమాజం పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని స్పష్టం చేశారు.

Collector |

పిల్లలు తమ తల్లిదండ్రులకు తడి–పొడి చెత్త వేరు చేయాలనే అవగాహన కల్పించాలని సూచించారు. పరిశుభ్రమైన సమాజం ఆరోగ్యాన్ని కాపాడుతుందని, తద్వారా ఆర్థిక భారం తగ్గుతుందని వివరించారు. చెత్తను చెత్త కుండీలోనే వేయాలని, ఎక్కడపడితే అక్కడ వేయరాదని హితవు పలికారు. గ్రీన్ అంబాసిడర్లు, పారిశుధ్య కార్మికులను గౌరవించాలని పిలుపునిచ్చారు.

Collector |

జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛ రథం ఇంటికి వచ్చినప్పుడు తడి–పొడి చెత్త వేరు చేసి అందించాలని కోరారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి. శంకర్ ప్రతి ఇంట్లో సేంద్రియ ఎరువు గుంట ఏర్పాటు చేసి 60 నుంచి 90 రోజుల్లో ఎరువు తయారు చేసుకోవచ్చన్నారు.

Collector |

తొమ్మిదో తరగతి విద్యార్థిని పలకలూరి పూజిత స్వచ్ఛతపై ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులకు కిట్‌లు పంపిణీ చేశారు. గ్రామ ప్రజలు రహదారుల నిర్మాణంపై తమ అభ్యర్థనలు వెల్లడించారు. మండల పరిషత్ అధ్యక్షులు స్వప్న, ఆర్డీఓ కె. శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం. పద్మావతి, జెడ్పీటీసీ కందుల సిద్దయ్య, ఎంపీటీసీ ఎం. సురేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా ముందుండి శుభ్రత పనుల్లో పాల్గొన్న కలెక్టర్ తమీమ్ అన్సారియా చర్యలు ప్రజల్లో విశేష స్పందన కలిగించాయి.

Leave a Reply