Collector | ప్రణాళికాబద్ధంగా రీ సర్వే నిర్వహించాలి…

Collector | ప్రణాళికాబద్ధంగా రీ సర్వే నిర్వహించాలి…
Collector | చల్లపల్లి – ఆంధ్రప్రభ : ప్రణాళికాబద్ధంగా రీ సర్వే నిర్వహించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డికే.బాలాజీ ఉద్యోగులకు సూచించారు. మంగళవారం చల్లపల్లి మండలం మాజేరు గ్రామంలో జరుగుతున్న భూముల రీ సర్వే ను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… సర్వే ఎలా చేస్తున్నారు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వారిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు కలిగేలా రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రీ సర్వే ద్వారా రైతుల హద్దులను తెలియజేసి వారికి పూర్తిగా హక్కు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు తమకు ఉన్న సందేహాలను ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు సర్వేయర్లు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

