Collector | జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి

Collector | జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి
- కలెక్టర్ కె.వెట్రిసెల్వి
Collector | ఏలూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ప్రభుత్వ ఆశయాలకనుగుణంగా నిర్దేశిత లక్ష్యాలను సాధించి ఏలూరు జిల్లాను రాష్ట్రంలో ముందు వరసలో ఉంచేలా పనిచేద్దామని కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ, జిల్లా అటవీశాఖాధికారి పీవీ. సందీప్ రెడ్డి, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ని కలిసి నూతన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా పనిచేసి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషిచేస్తూ జిల్లాను అభివృద్ధిపథంలో నిలుపుదామన్నారు. పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని , వాటిని అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూడాలన్నారు.

ఆర్డిఓలు అచ్యుత అంబరీష్, ఎం.వి.రమణ, కలెక్టరేట్ పరిపాలనాధికారి నాంచారయ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. భాస్కర్, ఏపిఈపీడిసిఎల్ ఎస్ఈ పీ.సాల్మన్ రాజు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి హబీబ్ భాషా, ఏపీ ఎంఐపి అధికారి ఎస్.రామ్మోహన్, నగర పాలక కమిషనర్ ఎ.భానుప్రతాప్, కాలుష్య నియంత్రణ మండలి ఇఇ వెంకటేశ్వరరావు, జిల్లా పరిశ్రమలకేంద్రం జీఎం వెంకటరావు, డి.ఆర్.డి.ఎ పిడి అర్.విజయరాజు, ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, ఎల్‌డీ ఎండీ.నీలాద్రి, బీజీ కార్పొరేషన్ ఈడీ ఎన్. పుష్పలత, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఆర్.నాగరాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ కార్యాలయ అధికారులు, సిబ్బంది, ఉద్యోగ సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్‌కి శుభాకాంక్షలు తెలిపినవారిలో ఉన్నారు. చాలామంది పూల బొకేల బదులు పేద విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు, పెన్నులు, దుప్పట్లు అందజేసి ఆదర్శప్రాయంగా శుభాకాంక్షలు తెలిపారు.




