Collector | పోలింగ్ కేంద్రంలో కలెక్టర్
Collector | గీసుగొండ, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సత్య శారద పరిశీలించారు. ఓటింగ్ సరళి పరిశీలిస్తూ.. సంబంధిత అధికారులకు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. కలెక్టర్ సత్య శారదతో పాటు ఎమ్మార్వో రియాజుద్దీన్, ఎంపీడీవో కృష్ణవేణి, ఎంపీ ఓ పాక శ్రీనివాస్, కమలాకర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

