ఇందిరమ్మ లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు

ఇందిరమ్మ లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు

నిగ్వ పంచాయతీ కార్యదర్శి సింధుజా ను సస్పెండ్ చేయాలని లబ్ధిదారుల డిమాండ్

కుభీర్, ఆంధ్రప్రభ : మండలంలోని నిగ్వ గ్రామ పంచాయతీ కార్యదర్శి సింధుజా ఇందిరమ్మ లబ్ధిదారులైన సోనుబాయి, పుల్లోళ్ళ నందబాయిల నుండి లొకేషన్ మార్చేందుకుగాను రూ. 40 వేలు తీసుకున్నారని లబ్ధిదారులు కన్నీరు మున్నీరవుతున్నారు. బుధవారం నిగ్వ గ్రామంలో లబ్ధిదారులు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. మొదటి విడతలో భాగంగా తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా పాకలాంటి తమ ఇల్లును కూలగొట్టుకొని చదును చేశామన్నారు.

మార్కోట్ ఇవ్వడానికి వచ్చిన అధికారులు పంచాయతీ కార్యదర్శి సింధుజా ఆ స్థలం ఇందిరమ్మ ఇంటి కొలతలకి సరిపోడం లేదని మార్కోట్ ఇవ్వరాదని చెప్పి వెళ్లిపోయారు. తన భర్త గ్రామపంచాయతీ లో మల్టీపర్పస్ వర్కర్ గా పనిచేస్తుంటారు. అయినా తనపై ఇసుమంత కనికరం చూపించకుండా పంచాయతీ కార్యదర్శి సింధుజా ఎక్కడైనా స్థలం కొనుక్కోవాలని లేదంటే మంజూరైన ఇల్లు వెనక్కి వెళ్ళిపోతుందని చెప్పడంతో బంధువులు, గ్రామస్తుల వద్ద అప్పులు చేసి గ్రామంలోని ఒక ఖాళీ స్థలంలో ఉన్న ప్లాట్ ను కొనుగోలు చేశాం.

అక్కడ మార్కెట్ ఇవ్వడానికి నిరాకరించిన పంచాయతీ కార్యదర్శి సింధుజా లొకేషన్ చేంజ్ కోసం పై అధికారులకు డబ్బులు ఇవ్వవలసి ఉంటుందని చెప్పి రూ. 20 వేలు ఇస్తేనే మార్కోట్ ఇస్తానని చెప్పడంతో గతి Able పరిస్థితిలో ఆమెకు రూ.20వేలు ఇచ్చామని కన్నీరు మున్నీరయ్యారు. డబ్బులు అడిగి పుచ్చుకున్న ఆడియో క్లిప్పింగులు వైరల్ కావడంతో పీఎస్ సింధుజ లబ్ధిదారులకు ఫోన్లు చేస్తూ నా జీతం పోతుంది డబ్బులు ఇచ్చినట్లు ఎవరికీ చెప్పకండి అంటూ ప్రాధేయపడుతున్నట్లు ఆడియోలు వైరల్ అవుతున్నాయి.

ఈ విషయమై ఎంపీడీవో గంగాసాగర్ రెడ్డిని వివరణ కోరగా ఇందిరమ్మ ఇల్లు పేదలకు మంజూరయ్యాయని పేదల వద్ద డబ్బులు తీసుకోవడం లంచాలు అడగడం క్షమించరానిదని సెక్రటరీ సింధుజ పై విచారణ జరిపి లంచం తీసుకున్న విషయం నిజమైనట్లు తెలిస్తే ఆమెపై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తానని చెప్పారు. కాగా పంచాయతీ కార్యదర్శి సింధుజ కుబీర్ లోని మండల పరిషత్ కార్యాలయంలో ప్రతి బుధవారం జరిగే సమావేశానికి హాజరై టీవీ9 లో ప్రసారమైన వీడియో క్లిప్పింగ్ను చూసి వెంటనే అక్కడినుండి తస్కరించినట్లు అధికారులు మిగతా పంచాయతీ కార్యదర్శులు తెలిపారు.

Leave a Reply