• 80 యూనిట్ల రక్తం సేకరణ

క‌రీంన‌గ‌ర్‌, ఆంధ్ర‌ప్ర‌భ : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని, కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ కళాశాల (పీటీసీ)లో ఈ రోజు “GIVE BLOOD – SAVE LIFE” నినాదంతో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం(Commissioner Goush Alam) ప్రత్యేక అతిథిగా హాజరై శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “సమాజం కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు మనందరికీ ప్రేరణగా నిలవాలి” అని అన్నారు. రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు పోలీసు శాఖలో స్ఫూర్తిదాయకమని తెలిపారు.

పీటీసీ ప్రిన్సిపల్ అడిషనల్ ఎస్పీ ఎం. పిచ్చయ్య(SP M. Picchaiah) మాట్లాడుతూ.. ఈ క్యాంపు ద్వారా సేకరించిన 80 యూనిట్ల రక్తాన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి బ్లడ్ సెంటర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డీఎస్పీ బి. మోహన్, జి. విజయపాల్ రెడ్డి, సి.హెచ్. మల్లికార్జున్, బి. గంగాధర్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మహేష్, రమేష్ లతో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply