నర్సాపురంలో కూలిపోయింది..

నర్సాపురంలో కూలిపోయింది..

నరసాపురం , ఆంధ్రప్రభ : మొంథా తుఫాన్ ప్రభావంతో ఈస్తున్న ఈదురుగాలులు కారణంగా తీరంలో పలు వృక్షాలు నేల రాలుతున్నాయి. పట్టణంలోని పార్క్ రోడ్డు సాయిబాబా గుడి వెనకాల గల పడుగుల తోటలో సుమారు వందేళ్ళు నుంచి ఉంటున్న భారీ వృక్షాలు చేనేత కార్మికులకు నీడ నిస్తున్నాయి.

ఆ చెట్లు కింద తర తరాలగా చేనేత వృత్తి చేసుకుంటూ కొన్ని కుటుంబాలు జీవిస్తున్నాయి. చేనేత కార్మికులు నేత చేసుకునే ప్రదేశంలో గల సుమారు పది చెట్లు నేలకొలగడంతో కార్మికుల పనికి ఆటంకంగా మారింది. సోమవారం నాడు నేలకొరిగిన ఒక చెట్టు ప్రభావం మిగతా చెట్లపై పడింది.

చెట్టు మీద చెట్టు పడటం తో అక్కడ ఉన్న మొత్తం చెట్లు నేల ఒరిగాయి. ఈ విషయంను స్థానికులు సోమవారం నాడు అధికారులు దృష్టికి తీసుకెల్లా మని కార్మికులు తెలిపారు . పక్కనే ఉన్న విద్యుత్ తీగల మీద పడకుండా విషయం తెలుసుకున్న ఎలక్ట్రికల్స్ సిబ్బంది హుటాహుటిన అక్కడ చేరుకొని విద్యుత్ తీగలకు తగిలే కొమ్మలన్నింటిని సరిచేసి విద్యుత్ సరఫరా కు అంతరాయం లేకుండా చేసారు.

దీంతో అక్కడ పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. చెట్లు నేలవరగడం చూసిన తేనేత కార్మికులు తమ పడుగుల సామాగ్రిని ముందస్తుగానే భద్రపరుచు కున్నా మని, నేలకోరిగిన చెట్లు కారణంగా తమ పనికి ఆటంకంగా మారిందని, అధికారులు తక్షణ చర్యలు చేపట్టి చెట్లు తొలగించే ప్రక్రియ చేపట్టాలని చేనేత కార్మికులు, స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply