Code | ఎన్నికల రోజు వారపు సంత బంద్
Code | జైనూర్, ఆంధ్రప్రభ : ఈనెల 11న గురువారం పంచాయితీ ఎన్నికల కారణంగా కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా జై నూర్ మండల కేంద్రంలో గురువారం నిర్వహించే వారపు సంతను బంద్(Bund) పాటించాలని జైనూర్ తాసిల్దార్ ఆడ బిర్షావ్ కోరారు.
ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ.. గురువారం వారపు సంత మార్కెట్(market) పూర్తిగా బంద్ చేయించాలని ఎన్నికల కోడ్(Code)ని ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తాసిల్దార్ పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు, నాయకులు అందరూ సహకరించాలని వ్యాపారులు దూర ప్రాంతం నుండి వచ్చే వ్యాపారులు వార సంతకు రావద్దని ఆయన కోరారు.

