CMRF | CMRF చెక్కు పంపిణీ

CMRF | CMRF చెక్కు పంపిణీ

CMRF | తంగళ్ళపల్లి, ఆంధ్రప్రభ : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మల్లాపూర్ గ్రామంలో యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీ ఎడ్ల తిరుపతి ఆధ్వర్యంలో తాటిపల్లి ఎల్లవ్వకు రూ.25,000/- విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎడ్ల తిరుపతి మాట్లాడుతూ… పేద, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల(Welfare schemes)ను సకాలంలో వారికి చేరవేయడం యూత్ కాంగ్రెస్ ముఖ్య లక్ష్యమని తెలిపారు. అవసరంలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మల్లాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు సావనాపెల్లి బాబు, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మునిగల రాజు, మానవ హక్కుల విభాగం జిల్లా అధ్యక్షుడు గుగ్గిల భరత్ గౌడ్, వార్డు సభ్యులు బాస నర్సింలు, వెన్నమనేని రమణరావు, ఎడ్ల రాజు, బాస రాజు, గట్టు రాజిరెడ్డి, ఎడ్ల వంశీతో పాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply