CMRF checks | సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత

CMRF checks | సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత

CMRF checks | భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : భీంగల్ పట్టణంలో ఈ రోజు పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన చెక్కులను లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బాల్కొండ నియోజక వర్గం బాద్యులు ముత్యాల సునిల్ కుమార్ ఆధ్వర్యంలో చెక్కులు మంజూరు చేయించడం జరిగింది.

భీంగల్ పట్టణానికి చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు(CMRF checks) సుమారు రెండు లక్షల రావడం జరిగింది. లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు కాబట్టి చెక్కులు తొందర రావడం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షులు పర్శ అనంతరావు, సుంకరి సురేష్, తోట సతీష్, నల్లూరి శ్రీనివాస్, నాగభూషణ్, బోయిగల్లి మహేష్, బొదిరే శ్రీకాంత్, శ్రీకాంత్, నవీన్, తోట నర్సయ్య, మొండి దినేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply