లింగాలలో సిఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ..

లింగాలలో సిఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ..

  • లబ్ధిదారుని ఇంటికే వెళ్లి పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీనివాసరావు

ఆంధ్రప్రభ గంపలగూడెం : గంపలగూడెం మండలం లింగాల గ్రామంలో మిర్యాల స్వామికి రూ.62,394 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు వారి ఇంటి వద్ద అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారుని ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేణుగోపాల రెడ్డి, సీనియర్ నాయకులు బుస కృష్ణ, కృష్ణయ్య, మల్లవరపు చైతన్య, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply