CMRevanth Reddy | మహిళా సంక్షేమానికి పెద్దపీట….
CMRevanth Reddy | ఊట్కూర్, ఆంధ్ర ప్రభ : మహిళాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఊట్కూర్ మాజీ జెడ్పీటీసీలు సూర్య ప్రకాశ్ రెడ్డి, మణెమ్మ అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మహిళా సమైక్య కార్యాలయంలో ఇందిరమ్మ చీరలు పంపిణీచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆడపడుచుల ఆత్మగౌరవం ఇందిరమ్మ చీరలని అన్నారు.
ముఖ్యమంత్రి అందిస్తున్న ఇందిరమ్మ చీర ఇంటి ఆడపడుచుకు అన్న ఇచ్చే సారేగా భావించాలని కోరారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy)కి దక్కిందన్నారు.నాణ్యమైన ఇందిరమ్మ చీరను ప్రభుత్వం మహిళలకు అందజేయడం, మహాలక్ష్మి ద్వారా ఆర్థిక బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా ప్రభుత్వం మహిళల పట్ల ప్రాముఖ్యతను వివరిస్తుందన్నారు.
మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించాలని లక్ష్యంతో వడ్డీ లేని రుణాలు వ్యాపారం చేసుకునేందుకు రుణాలు పెట్రోల్ బంకులు, మిర్చి మిషన్ తదితర వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు పంపిణీ చేస్తుందన్నారు. మండలంలో 9033 మంది(9033 people) ఆడ పడచులకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొన్ని గ్రామాల్లో మహిళలకు చీరల పంపిణీ ఆలస్యం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐకెపి ఎపిఎం వనిత కుమారి, మహిళా సమైక్య అధ్యక్షురాలు శివలీల, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భరత్, ఉప సర్పంచ్ రమేష్, వార్డు సభ్యులు కొక్కు మల్లేష్, ఇస్మాయిల్, నరేష్, అనిల్ కుమార్ రెడ్డి, భరత్, గోవిందమ్మ, సువర్ణ, రూప, భవిత మౌనిక తదితరులుపాల్గొన్నారు.

