Public meeting | సీఎం సభకు..

Public meeting | సీఎం సభకు..

  • భారీగా తరలివెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు

Public meeting | ఊట్కూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (Enumula Revanth Reddy) నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ఊట్కూర్ మండలం (Ootkur Mandal)లోని ఆయా గ్రామాల కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేయడంతో పాటు నారాయణపేట- మక్తల్, ఆర్ అండ్ బీ రహదారి నాలుగు లైన్ల పనులకు సీఎం శ్రీకారం చుట్ట‌నున్న‌ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు(Congress leaders), భారీగా జనాలు తరలించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు యాగ్నేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు సూర్య ప్రకాశ్ రెడ్డి, మనెమ్మ, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కోర మహేష్, పట్టణ అధ్యక్షులు లింగంతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply