కాశీబుగ్గ దుర్ఘటనపై సీఎం దిగ్ర్భాంతి ..కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విచారం

కాశీబుగ్గ దుర్ఘటనపై సీఎం దిగ్ర్భాంతి ..కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విచారం

( కాశీబుగ్గ ఆంధ్రప్రభ ): కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో (KasibuggaTemple) శనివారం భక్తుల తోపులాట కారణంగా జరిగిన తొక్కిసలాటలో 9మంది వ్యక్తులు మరణించగా, మరో 14మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఏకాదశి, శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది.

క్షతగాత్రులను కాశీబుగ్గ (Kasibugga) ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. జిల్లాలోనే ఉన్న మంత్రి అచ్చెన్నాయుడు హుటాహుటిన కాశీబుగ్గకు వెళ్లారు. మంత్రి అచ్చెన్నాయుడు, హోమ్ మంత్రి అనిత, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Leave a Reply