CM Revanth Reddy | గ్రామాభివృద్ధికి కట్టుబడి పని చేస్తా…

CM Revanth Reddy | గ్రామాభివృద్ధికి కట్టుబడి పని చేస్తా…

CM Revanth Reddy | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : తాండూర్ మండలం అచ్చలా పూర్ గ్రామ పంచాయతీ స్థానాన్ని జెనరల్ మహిళకు కేటాయించినా తన భార్య గట్టు రామాదేవిని ఏకగ్రీవంగా సర్పంచ్ చేసే అవకాశం ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఎమ్మెల్యే గడ్డం వినోద్ ల ఆదేశాలతో పదవిని త్యధించినట్లు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గట్టు మురళీధర్ రావు తెలిపారు.

ఈ రోజు తాండూర్ మండలం అచ్చలా పూర్ గ్రామంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్ గా గృహిణి మారిశెట్టి స్రవంతి శ్రీనివాస్ ను బరిలోదించి కాంగ్రెస్ పార్టీ బలపరిచ్చినట్లు మురళీధర్ రావు తెలిపారు. మారిశెట్టి స్రవంతికి ఈ రోజు నిర్వహించిన ర్యాలీలో ప్రజలు బ్రహ్మరథం పట్టినట్లు ఆయన తెలిపారు.

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రఘునాథ రెడ్డి పాల్గొన్న ఈ ర్యాలీకి ప్రజలు పెద్ద సంఖ్యలో త‌ర‌లి రావడం స్రవంతి గెలుపుకు నాంది పలుకుతుందని తెలిపారు. స్రవంతికి ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే కుల మతాలకతీతంగా గ్రామాభివృద్ధికి కట్టుబడి పని చేస్తామని గట్టు మురళీధర్ రావు తెలిపారు.

Leave a Reply