CM Revanth Reddy | మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తాం..

CM Revanth Reddy | మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తాం..

  • భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
  • రూ.పది కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

CM Revanth Reddy | భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సహకారంతో ప్రత్యేక నిధులతో భూపాలపల్లి మున్సిపాలిటీని అభివృద్ధిలో ముందు ఉంచుతానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం భూపాలపల్లిలోని 5 ఇంక్లైన్ కమాన్ దగ్గర రూ.7 కోట్లతో కమ్యూనిటీ హాల్, అంబేద్కర్ కళాక్షేత్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పెద్దకుంటపల్లిలో రూ.2 కోట్లతో అంతర్గత సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

జంగేడులో రూ.50 లక్షలతో వైకుంఠధామం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రాంనగర్ కాలనీలో 50 లక్షలతో బొగ్గు లోడింగ్ ఆన్ లోడింగ్ కార్మికుల యూనియన్ సంక్షేమ భవనం నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూపాలపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను మెరుగుపరచడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కమ్యూనిటీ హాల్, అంబేద్కర్ భవనం(Ambedkar Bhavan) వంటి ప్రజా ఉపయోగకరమైన నిర్మాణాలు సామాజిక ఐక్యతకు దోహదపడతాయని, అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులతో కాలనీలలో పారిశుద్ధ్యం మెరుగుపడుతుందని తెలిపారు.

వైకుంఠ ధామం నిర్మాణంతో అంత్యక్రియల సమయంలో కుటుంబాలకు సౌకర్యం కలుగుతుందని, కార్మికుల యూనియన్ సంక్షేమ భవనం ద్వారా కార్మికుల సమస్యలకు పరిష్కార వేదిక ఏర్పడుతుందన్నారు. అభివృద్ధి(Development) పనులు నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

భూపాలపల్లి పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొంటూ, ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్ర కొమురయ్య, దేవన్, దాట్ల శ్రీనివాస్, అప్పం కిషన్, సాంబమూర్తి, తోట రంజిత్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply