సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ…
ఇటిక్యాల, ఆంధ్రప్రభ : సీఎం సహాయ నిధుల నుండి లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను శనివారం పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు సోమనాద్రి పోతురాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్, జోగులమ్మ గద్వాల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సరితా తిరుపతయ్యలు సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధికి సిఫారసు చేయగా ఎర్రవల్లి మండలంలోని కొండేరు గ్రామంలో లబ్ధిదారులు కురువ సుజాత కు రూ.39500 వేలు, రహీం పాషా రూ.60000 వేలు, బి రమేష్ నాయుడు 9500 వేలు, గణేష్ లకు 34000 వేల రూపాయలు సహాయ నిమిత్తం అర్హులైన లబ్ధిదారులకు చెక్కులు రావడంతో వారికి అందజేయడం జరిగిందని సోమనాద్రి పోతురాజు తెలిపారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు .
