నిరుపేదల ఆరోగ్యానికి కూటమి భరోసా

నిరుపేదల ఆరోగ్యానికి కూటమి భరోసా
- కష్టకాలంలో అండగా సీఎం రిలీఫ్ ఫండ్
- ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..
- గంపలగూడెం మండలంలోని 8 గ్రామాల లబ్ధిదారులకు రూ.6.42 లక్షల చెక్కులు పంపిణీ..
- అనారోగ్య బాధిత కుటుంబాలకు ఆప్యాయ పలకరింపు
గంపలగూడెం,ఆంధ్రప్రభ : ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ప్రభుత్వం అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తోందని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు సహాయం అందించడం ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. గంపలగూడెం మండల పర్యటనలో భాగంగా ఊటుకూరు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయుక్తంగా నిలుస్తోందన్నారు.
మండలంలోని కనుమూరు, పెదకొమిరా, మేడూరు, పెనుగొలను, ఊటుకూరు, ఉమ్మడి దేవరపల్లి, నెమలి, గొళ్లపూడి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మొత్తం 14 చెక్కులు పంపిణీ చేశారు. వీటి మొత్తం విలువ రూ.6,42,780గా ఉందని తెలిపారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన వారికి తక్షణ సహాయం అందించేందుకు సీఎంఆర్‌ఎఫ్‌ను సమర్థవంతంగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లవరపు చైతన్య, బుసా కృష్ణ, గుండ్రెడ్డి వెంకటలక్ష్మి, నల్లగట్ల తరుణీ, అజయ్, గోపి, ప్రతాప్, అంజి తదితరులు పాల్గొన్నారు.
