CM Cup | సీఎం కప్ క్రీడల్లో విద్యార్థులు రాణించాలి…

CM Cup | సీఎం కప్ క్రీడల్లో విద్యార్థులు రాణించాలి…

CM Cup | ఊట్కూర్, ఆంధ్రప్రభ : సీఎం కప్ క్రీడల్లో విద్యార్థులు రాణించి రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపిక కావాలని ఊట్కూర్ ఎంపీడీవో కిషోర్ కుమార్ అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో సీఎం కప్ క్రీడలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు చదువుతో పాటు క్రీడారంగంలో నైపుణ్యాన్ని పెంచాలని లక్ష్యంతో సీఎం కప్ క్రీడలు నిర్వహిస్తుందని అన్నారు. విద్యార్థులు క్రీడల్లో తమ ప్రతిభను చాటి జిల్లా రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై మండలానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.

క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉందని క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వానికి దోహదపడతాయని అన్నారు. గ్రామాల్లో ప్రారంభించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఈనెల 28న మండలస్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎం కుసుమ, పీడీలు పారిజాత, సాయినాథ్, క్రీడాకారులు కోరంమహేష్ రెడ్డి, బాలాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply