CM Cup | 30న మండల స్థాయి సీఎం కప్ పోటీలు

CM Cup | 30న మండల స్థాయి సీఎం కప్ పోటీలు

CM Cup | ముధోల్, ఆంధ్రప్రభ : ముధోల్ మండలానికి సంబంధించిన 2025 -26 మండల స్థాయి సీఎం కప్ పోటీలను తేదీ 30.01.2026 రోజున ఉదయము 9:30 గంటలకు నిర్వహిస్తున్నామని ముధోల్ ఎంపిడిఓ లవ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

మండలానికి సంబంధించి ఐదు క్లస్టర్లలో మండల స్థాయికి ఎంపికైన క్రీడాకారులు మాత్రమే ముధోల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 30.01.2026 శుక్రవారం రోజున ఉదయం 9 గంటలకు రిపోర్ట్ చేయాలని కోరారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, మరియు అథ్లెటిక్స్ కి చెందిన మండల స్థాయికి ఎంపికైన క్రీడాకారులు అవకాశమును సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు.

Leave a Reply