నంద్యాల, (ఆంధ్రప్రభ): నంద్యాల జిల్లాలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం అహోబిలంలో నిర్వహించనున్న పార్వేట ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరుకావాలని ఆలయ కమిటీ సభ్యులు, కిడామీ సీతారామన్ ఆలయ అర్చకుడు మధు, శ్రీవచన్లు ఆహ్వానించారు.

వందల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం, శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి విధంగా పార్వేట ఉత్సవాల్లో ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించాలని వారు సీఎంను కోరారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు.

సీఎం చంద్రబాబు అహోబిలం ఆలయాభివృద్ధి కోసం రూ.25 కోట్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం నవ నరసింహ స్వామి చిత్రపటాన్ని ముఖ్యమంత్రికి బహుకరించారు.

ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాల సమర్పణ కొనసాగించాలని కోరిన కమిటీ సభ్యులు, ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply