ఆంధ్రప్రదేశ్‌లో మహిళల రవాణా హక్కులకు నూతన దిశగా ‘స్త్రీ శక్తి’ పథకం ఆవిష్కృతమైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ RTC బస్సులో ప్రయాణించి అధికారికంగా ప్రారంభించారు. ప్రజా హితానికి కట్టుబడి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ఈ కీలక పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే ‘స్త్రీ శక్తి’ పథకాన్ని (Stree Shakti Scheme) ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chief Minister Chandrababu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మహిళల కోసం ఈ కీలక పథకం నేటి నుంచి అమలు చేస్తున్నారు.

ఈ కార్యక్రమం కోసం ఉండవల్లి నుంచి తాడేపల్లి, కనకదుర్గ వారధి మీదుగా విజయవాడ (Vijayawada) బస్ టెర్మినల్ వరకు చంద్రబాబు, పవన్, లోకేశ్ బస్సులోనే వెళ్లారు. వీరితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ (BJP state president Madhav), పలువురు ఇతర కూటమి నేతలు కూడా ఈ ప్రయాణంలో పాల్గొన్నారు.

సీఎం, మంత్రులు ప్రయాణిస్తున్న బస్సు వెళ్లే మార్గంలో మహిళలు పెద్ద సంఖ్యలో గుమిగూడి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దారి పొడవునా మంగళహారతులతో నీరాజనాలు పలుకుతూ ఘన స్వాగతం పలికారు. థాంక్యూ సీఎం సర్ (Thank you CM Sir) అంటూ నినాదాలతో తమ కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ (TDP, Jana Sena, BJP) కార్యకర్తలు, నేతలు పలుచోట్ల బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీల్లో ఒకటైన ఈ పథకాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా మహిళల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

Leave a Reply