CM | రేవంత్ రెడ్డిని కలిసిన..

CM | రేవంత్ రెడ్డిని కలిసిన..

  • ఉమ్మడి రంగారెడ్డి మేడ్చల్ జిల్లా మాజీ జనరల్ సెక్రటరీ బాలరెడ్డి..

CM | మేడ్చల్, ఆంధ్రప్రభ : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌కు చెందిన మాజీ జనరల్ సెక్రటరీ బాలరెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ భేటీలో మేడ్చల్ నియోజకవర్గంలో అభివృద్ధి అంశాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. జిల్లాల అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Leave a Reply