CM | ఫుట్‌బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి

CM | ఉమ్మడి మెదక్ బ్యూరో, ఆంద్రప్రభ : సంగారెడ్డి జిల్లా సదాశివపేట కంకోల్‌లోని వోక్సెన్ యూనివర్సిటీలోని విద్యార్ధులతో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ఆడారు. మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి యూనివర్సిటీలో విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ విభాగాలకు ఎగ్జిబిషన్ స్టాళ్ల(Exhibition stalls)ను గురువారం రాత్రి ఆయన సందర్శించారు. విద్యార్థులు ఆయా అంశాల్లో ప్రదర్శించిన నైపుణ్యతను(Demonstrated skill) అడిగి తెలుసుకున్నారు.

CM

అనంతరం వోక్సెన్ స్పోర్ట్స్ అకాడమీని పరిశీలించారు. అనంతరం వోక్సెన్ విద్యార్థుల(Voxen students)తో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడి విద్యార్థుల్లో జోష్ నింపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… చదవుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. అప్పుడే మానసిక దృఢత్వంతో పాటు శారీరక దృఢత్వం(Physical fitness) పెరుగుతుందన్నారు. విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్న వోక్సెన్ యూనివర్సిటీ నిర్వాహకులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో వోక్సెన్ వ్యవస్థాపకులు, చాన్సలర్ ప్రవీణ్ కె పూల, ఇతరులు పాల్గొన్నారు.

CM

Leave a Reply