CM | ఎమ్మెల్యేలు ఎన్నుకున్న నాయకుడే.. రేవంత్ రెడ్డి

CM | ఎమ్మెల్యేలు ఎన్నుకున్న నాయకుడే.. రేవంత్ రెడ్డి
CM | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్‌రెడ్డిపై జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్‌ఎస్, బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలు ఎన్నుకున్న నాయకుడే సీఎం రేవంత్ రెడ్డి అని స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, బీఆర్‌ఎస్, బీజేపీ వేర్వేరు పార్టీలుగా కనిపించినప్పటికీ భవిష్యత్తులో కలిసే అవకాశముందని జోస్యం చెప్పారు.
మంత్రులపై విమర్శలు చేసే వారు తగిన ఆధారాలు తీసుకురావాలని సవాల్ విసిరారు. ముఖ్యంగా మంత్రి పొంగులేటిపై వస్తున్న ఆరోపణలపై ఆధారాలు ఉంటే చర్చకు సిద్ధమని తెలిపారు. బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు వద్ద ఎలాంటి ఆధారాలున్నా వాటిని బయటపెట్టాలని మహేశ్ కుమార్ గౌడ్ కోరారు. రాజకీయ విమర్శలు ఆధారాలతోనే ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
