రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు..

చిట్యాల, ఆంధ్రప్రభ : ఈ నెల 14వ తేదీ శనివారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి కోడెపాక రఘుపతి తెలిపారు. మండల కేంద్రంలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం 278 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అందులో 168 మంది బాలికలు, 110 మంది బాలురు ఉన్నారని తెలిపారు.

పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని పోలీసులకు సూచించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఇద్దరు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులు, 20 మంది ఇన్విజిలేటర్లను నియమించామని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ఎంఈఓ రఘుపతి సూచించారు.

Leave a Reply