హైదరాబాద్ – తాను ఆత్మహత్యకు ప్రయత్నించ లేదని, రోజు వారివాడే మందులలొ హైడోస్ గా తీసుకోవడంతోనే తాను అపస్మారక స్థితికి వెళ్లినట్లు తెలిపారు గాయని కల్పన . నిన్న అపస్మారక స్థితిలో ఉన్న గాయనిని చికిత్స కోసం పోలీసులు కార్పొరేట్ హాస్పటల్లో చేర్చారు.. అక్కడ ఆమె చికిత్స పొందుతూ కోటుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె నుంచి పోలీసులు వాగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సంఘటనను ఆమె వివరించారు. తాను ఇన్సోమ్నియాతో బాధపడుతున్నానని, . దానికోసం కొంతకాలంగా టాబ్లెట్స్ వాడుతున్నానని తెలిపారు..ఈ . టాబ్లెట్స్ ఓవర్డోస్ కావడంతో అపస్మారకంలోకి చేరుకున్నానని చెప్పారు.. ఈ సమయంలోనే తన భర్త పలుసార్లు ఫోన్ చేశారన్నారు.. తాను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అపార్ట్మెంట్ కార్యదర్శికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారన్నారు కల్పన. తమ కుటుంబంలో ఎటువంటి వివాదాలు లేవని చెప్పారు.
ఇదే విషయం తెలిసిన కేరళలో ఉంటున్న ఆమె కుమార్తె హైదరాబాద్ కు చేరుకున్నారు.. తల్లి ఆరోగ్యంపై వైద్యులతో మాట్లాడారు. ఆమెకు ఎటువంటి ఇబ్బంది లేదని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. ఈ సంఘటనపై ఆమె మాట్లాడుతూ, ఒత్తిడి కారణంగానే ఒకింత ఎక్కువ మోతాదులో తన తల్లి మాత్రలు తీసుకున్నదని తెలిపారు. తన తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారని, వారు చాలా బాగా ఉంటున్నారని చెప్పారు. తన తల్లి ఆత్మహత్యాయత్నం చేయలేదని స్పష్టం చేశారు. దయచేసి తప్పుడు కథనాలు సృష్టించవద్దని మీడియాను కోరారు.