న్యూ ఢిల్లీ – ఆపరేషన్ సింధూర్ వివరాలను బహిర్గతం చేయాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ను కోరారు.. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేసిన రాహుల్.. అందులో జై శంకర్ మౌనంపై ప్రశ్నలు సంధించారు. మే 7వ తేదీన జరిగిన ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించి మన దాడి ప్రారంభంలోనే పాకిస్తాన్‌కు సమాచారం ఇవ్వడం నేరం అని జైశంకర్‌పై తీవ్రంగా మండిపడ్డారు. విదేశాంగ మంత్రి నిశ్శబ్దం కేవలం సమాచారాన్ని వెల్లడించడం కాదు.. అది విపత్కరమని రాసుకొచ్చారు.
అలాగే, భారత వైమానిక దళం ఈ ఆపరేషన్‌లో ఎన్ని విమానాలు కోల్పోయిందనే గత ప్రశ్నను మరోసారి గుర్తు చేశారు. “మరోసారి అడుగుతున్నాను” పాకిస్తాన్‌కు ముందే సమాచారం తెలియడంతో మనం ఎన్ని విమానాలు కోల్పోయాము?” అని జైశంకర్‌ని అడిగారు. ఈ ట్వీట్ రాహుల్ గాంధీ రెండు రోజుల క్రితం చేసిన పోస్ట్‌కు కొనసాగింపుగా రాసుచ్చారు.
అయితే, ఆపరేషన్ సింధూర్ వివరాలను ప్రారంభానికి ముందే బహిర్గతం చేశారని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పై తీవ్రంగా ఆరోపిస్తూ.. ఈ నెల 17న రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అందులో “ఇది ఒక తప్పు కాదు, ఇది నేరం. దేశం సత్యాన్ని తెలుసుకోవాలి,” అని రాసుకొచ్చారు. భారత ప్రభుత్వం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై సైనిక దాడుల గురించి ముందస్తు హెచ్చరిక ఇచ్చిందని రాహుల్ ఆరో్పించారు. భారత విదేశాంగ మంత్రి “మన దాడి గురించి ముందస్తుగానే పాక్ కు సమాచారం ఇచ్చినట్లు పబ్లిక్‌గా అంగీకరించారని వెల్లడించారు. ఈ చర్యకు ఎవరు అధికారం ఇచ్చారు అని ప్రశ్నించారు. ఈ యుద్ధం ఫలితంగా మనం ఎన్ని విమానాలు కోల్పోయామో చెప్పాలని డిమాండ్ చేశారు.