Cinema | హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుతూ ….

ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన హరిహర వీరమల్లు విజయం సాధించాలని జనసేన శ్రేణులు, అభిమానులు ఈరోజు సాయంత్రం అలిపిరి వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కుకున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ అయ్యాక విడుదల అవుతున్న తొలి చిత్రం హరిహర వీరమల్లు అని పేర్కొంటూ ఈ సినిమా ద్వారా గొప్ప మెసేజ్ ప్రజలకు పవన్ కళ్యాణ్ ఇవ్వనున్నారన్నారు

రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక సినిమాలు త‌గ్గించుకున్న‌ప్ప‌టికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ప్యాన్స్ క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని అంటూహరిహర వీరమల్లు సినిమా భారీ సక్సెస్ సాధిస్తుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో హరిహర వీరమల్లు ఘన విజయం అందుకోవాలని అలిపిరి శ్రీవారి పాదాల వద్ద కాయలు కొట్టి శ్రీవేంకటేశ్వర స్వామిని ప్రార్ధించినట్టు తెలిపారు. .

ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షులు రాజా రెడ్డి, కార్పొరేటర్లు సీకే రేవతి, దూది కుమారి, శైలజ, యాదవ కృష్ణా, దూది శివ, ఆకేపాటి సుభాషిణి, డాక్టర్ ఆకుల వనజ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply