cI | ఉత్తమ గుణాలతో, ఉన్నత లక్ష్యాలతో విద్యార్థులు విజేతలు కావాలి..

cI | ఉత్తమ గుణాలతో, ఉన్నత లక్ష్యాలతో విద్యార్థులు విజేతలు కావాలి..
cI | ఆలేరు,ఆంధ్రప్రభ:విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా మానవీయ విలువలతో ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆలేరు సీఐ యాలాద్రి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని పద్మావతి గార్డెన్ లో వెంకట రమణ జూనియర్ కళాశాల విద్యార్థి వీడ్కోలు కార్యక్రమం మంగళవారం ఎంతో ఘనంగా జరిగింది.
కళాశాల ప్రిన్సిపాల్ నాళం అయ్యప్ప అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథి సీఐ యాలాద్రి, రచయిత, పాత్రికేయులు డాక్టర్ తిరునగరి శ్రీనివాస్, విశ్రాంత మండల విద్యాధికారి పటేల్ సుధాకర్ రెడ్డి, కళాశాల చైర్మన్ కటకం నందం లు జ్యోతి ప్రజ్వలన చేశారు. సీఐ యాలాద్రి మాట్లాడుతూ విద్యార్థులు అందరికీ ఆదర్శంగా ఉండాలని తెలిపారు. నైతిక విలువలను పెంపొందించుకొని విజేతలుగా నిలవాలని సూచించారు. డాక్టర్ తిరునగరి శ్రీనివాస్ మాట్లాడుతూ విధ్యార్థులు రాబోయే వార్షిక పరీక్షలో పట్టుదలతో చదివి మంచి మార్కులు సాధించాలని కోరారు. ధైర్యంగా ముందుకు వెళతామని గురువులకు భరోసా ఇవ్వాలని, సంకల్పంతో పరీక్షలో ఉత్తీర్ణులై చూపాలని చెప్పారు.
మాజీ మండల విద్యాధికారి పటేల్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి అంటే నియమ నిబంధనలు పాటించాలని. చదువు తో పాటు విద్యార్థులకు సంస్కారం కూడా అలవడాలని అన్నారు. విద్యా రంగంలో విఆర్ కళాశాల నిరంతర కృషిని ఆయన ప్రశంసించారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించాలని చెప్పారు. కళాశాల చైర్మన్ నందం మాట్లాడుతూ చదువుతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలని సూచించారు. గతంలో సాధించిన ఫలితాల కన్నా మెరుగైన తీరు ఈ సంవత్సరం ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
గత సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఈ కార్యక్రమంలో ఘనంగా కళాశాల పక్షాన సత్కరించారు. కార్యక్రమానికి హాజరైన అతిథులను కళాశాల ప్రిన్సిపాల్ నాళం అయ్యప్ప సన్మానించారు. ఈ కార్యక్రమం లో ఉప్పలి రాజు, పరుశరాములు, మానస, మధుసూదన్, వీరాచారి, కమలాకర్, సునంద, కృష్ణ కుమార్, ఉపాచారి, రమేష్, ఇందిర, లావణ్య, సుభాష్, సుభాష్, నమేర జాస్మిన్, పటేల్ వంశీరెడ్డి, సింధు, నర్మదా, భార్గవి, మాధవి పాల్గొన్నారు. విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
