Choutuppal | విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల ప్రజా బాట

Choutuppal | విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల ప్రజా బాట

  • ట్రాన్స్ఫార్మర్ మెయింటెనెన్స్ పనులు పరిశీలన
  • సీజీఎం బాలస్వామికి సన్మానం

Choutuppal | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఎస్ పీడీసీఎల్ రూరల్ జోన్ ఛీప్ ఇంజనీర్ యు బాలస్వామి తెలిపారు. తెలంగాణ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా అరెగూడెం గ్రామంలో రూరల్ జోన్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి తమ సిబ్బందితో కలిసి పర్యటించారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మెయింటినెన్స్ పనులను పరిశీలించారు. చౌటుప్పల్ డివిజనల్ ఇంజనీర్ డీఎస్ మల్లికార్జున్ గౌడ్, సబ్ డివిజన్ ఏడిఈ పద్మ, ఏఈ ఆర్ సతీష్, ఫీల్డ్ స్టాఫ్ గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ ల మెయింటనెన్స్ పనులు చేశారు.

గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నెపల్లి ధనలక్ష్మి వెంకట్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించి గ్రామంలో ఉన్న విద్యుత్ సమస్యలపై సమీక్ష చేశారు. సమస్యాత్మకంగా ఉన్న విద్యుత్ వైర్లను, స్తంభాలను పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పంతంగి విద్యుత్ సబ్ స్టేషన్ నుండి పంతంగి, ఆరేగూడెం, కాట్రేవ్ గ్రామాలకు సరఫరా అయ్యే 11 కె వి అగ్రికల్చర్ ఫీడర్ ను విడదీసి అరెగూడెం, కాట్రేవ్ గ్రామాలకు 11కేవీ అరెగూడెం అగ్రికల్చర్ ఫీడర్ బ్రేకర్ ను నూతనంగా ఏర్పాటు చేయగా గ్రామ సర్పంచ్ ఎన్నెపల్లి ధనలక్ష్మి వెంకట్ రెడ్డి అరెగూడెం గ్రామ విద్యుత్ వినియోగదారులతో కలిసి ఛార్జ్ చేశారు. గ్రామంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్న సీజీఎం బాలస్వామి కి, డి ఈ మల్లికార్జున్ గౌడ్ తదితర అధికారులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply