Champions Trophy – షమీకి పాంచ్ పటాకా…. భార‌త్ టార్గెట్ ఎంతంటే

దుబాయ్ లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ లో బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 ప‌రుగులు చేసి అలౌటైంది.. చివ‌రి వికెట్ హ‌ర్షిత్ రాణాకు త‌హిద్ రూపంలో ద‌క్కింది. ఇక తౌహిద్ శతకం చేశాడు. 114 బంతులలో రెండు సిక్స్ లు, ఆరు ఫోర్లతో వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు..ఈ మ్యాచ్ లో ష‌మీ అయిదు వికెట్లు ప‌డ‌గొట్టాడు..

ట‌స్కిన్ తొమ్మిదో వికెట్ గా మూడు ప‌రుగులు చేసి ష‌మి బౌలింగ్ లో పెవిలియ‌న్ కు చేరాడు.. ఇక ఎనిమిదో వికెట్ గా ష‌మీ బౌలింగ్ లో తంజిమ్ సున్నా ప‌రుగుల‌కు ఔటయ్యాడు. ఇక ఏడో వికెట్ గా హ‌ర్షిత్ రాణా బౌలింగ్ లో నిషాద్ హుస్సెన్ 18 పరుగులు చేసి ఔట‌య్యాడు.. ఈ మ్యాచ్ లో ఆరో వికెట్ గా ఔటైన జ‌క‌ర్ అలి 68 ప‌రుగులు చేసి ష‌మీ బౌలింగ్ లో చిక్కాడు.. ఇక 35 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజ్ లోకి వచ్చిన జకర్ అలి , తౌహిద్ లు బంగ్లా కుప్పకూలకుండా అడ్డుకున్నారు.. ఈ ఇద్దరు కలసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.. భారత్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని ఇద్దరు అర్ధశతకాలను పూర్తి చేసుకున్నారు.. ఆరో వికెట్ కి జకర్ అలి , తౌహిద్ లు 154 పరుగులు జోడించారు . దీంతో బంగ్లా గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోర్ చేయ‌గ‌లిగింది.

ఇక తొలి సెషన్ లో భారతీయ బౌలర్ల హవా కొనసాగింది. బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి మ్యాచ్ లో బంగ్లా బ్యాటర్స్ క్రీజులో కుదురుకోనివ్వకుండానే పెవిలియన్ కు చేర్చారు. 35 ప‌రుగుల‌కే అయిదు వికెట్లు ప‌డ‌గొట్టారు..

బంగ్లా బ్యాటర్స్ లో హసన్ 25 పరుగులు చేయగా, సౌమ్య సర్కార్, శాంటో, ముష్పికర్ లు డకౌట్ అయ్యారు. ఇక హసన్ మీర్జా సైతం 5 పరుగులకే వికెట్ పోగొట్టుకున్నాడు. జకర్ అలి 68 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో షమీ అయిదు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా ,హర్షీత్ రాణా కు మూడు, అక్ష‌ర్ కు రెండేసి వికెట్ లు ద‌క్కాయి. భార‌త్ విజ‌యం సాధించాలంటే 229 ప‌రుగులు చేయాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *