Chityala | ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి

Chityala | చిట్యాల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా నకిరేకల్లు నియోజకవర్గం చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆరాధ్య నేత, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలను టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
గ్రామ సర్పంచ్ బత్తుల లక్ష్మీప్రసన్న నర్సింహ గౌడ్ హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత ఎన్టీఆర్ అని, పేదలు, మహిళలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు.
కార్యక్రమంలో టీడీపీ గ్రామశాఖ అధ్యక్షుడు బత్తుల వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సీమ లింగయ్య, సీనియర్ నాయకులు బొడిగె విజయ్ కుమార్ గౌడ్, మిద్దెల యాదగిరి, మాజీ సింగిల్‌విండో చైర్మన్ అంతటి శ్రీనివాస్ గౌడ్, రత్నం నర్సింహ, జవాజి మత్స్యగిరి, మిద్దెల రామలింగయ్య, అంబాల మారయ్య, బొడిగె యాదయ్య, గోపగోని భాషా, బడే అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
