
Chityala | గీత కార్మికుల పాట్లు..
Chityala | చిట్యాల, ఆంధ్రప్రభ : గీత కార్మికుల జీవనాధారమైన తాటి చెట్లు వరి పొలంలో ఉండడంతో, కల్లు గీసేందుకు గీతా కార్మికులు, పాట్లు పడుతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో వాగులు, వంకలు, వరి పొలాల్లో గీత కార్మికుల జీవనాధారమైన తాటి చెట్లు ఉన్నాయి. రాత్రి, పగలు, కార్మికులు గీతవృత్తిలో భాగంగా కల్లు గీసేందుకు తాటి చెట్లు ఎక్కుతారు. వరి పొలాల్లో ఉండడం.. అక్కడ బురద ఉండడంతో గీత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు గీత కార్మికులు తాటి చెట్టుకు నిచ్చెనలు, కర్రలు పాతి కొంత దూరం వెళ్లి, తాటి చెట్టు ఎక్కుతున్నారు. తమ కుటుంబాల పోషణ కోసం ప్రమాదమని తెలిసి కూడా గీత కార్మికులు, చెట్లు ఎక్కడం విచారకరమని పలువురు అంటున్నారు.
