Chityala | కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఈ సిట్ విచారణ…

Chityala | కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఈ సిట్ విచారణ…

Chityala | చిట్యాల, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన నాయకుడిని రాజకీయ కక్షతో విచారణ పేరుతో వేధించడం తగదని మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు ఆదివారం నాడు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధి చిట్యాల మండలంలో కేసీఆర్ ను సీట్ విచారణకు పిలవడం బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలుపు మేరకు నిరసిస్తూ చిట్యాలలో భారీ బైక్ ర్యాలీ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని సిట్ విచారణకు పిలవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి చిరుమర్తి లింగయ్య తీవ్రంగా ఖండించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన నాయకుడిని రాజకీయ కక్షతో విచారణ పేరుతో వేధించడం తగదని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షలు, ఉద్యమాల త్యాగాలతో సాధించిన తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్ ను ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ సిట్ విచారణ చేపట్టారని విమర్శించారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రతీకార చర్యగా ఆయన అభివర్ణించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల పోరాటాలు ఇలానే కొనసాగుతాయని తెలిపారు. కేసీఆర్ పై జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో తగిన సమాధానం ఇస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply