Chitya | అసత్య ఆరోపణలే- జడల.

Chitya | అసత్య ఆరోపణలే- జడల.
Chitya | చిట్యాల, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చిట్యాల లో ఇటీవల చంద్రపురి కాలనీలలో ప్రభుత్వంపై మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య చేసిన విమర్శలు అసత్య ఆరోపణలు అని చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జడల చిన్న మల్లయ్య అన్నారు. మంగళవారం నాడు చిట్యాలలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై చేస్తున్న ఆరోపణలు సరైనవి కావని పట్టణ ప్రజలు గమనిస్తున్నారని, మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయం లోనే శివనేనిగూడెంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి ప్రజలను ఇబ్బంది గురి చేసింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు.
మళ్లీ ఈరోజు డంపింగ్ యార్డ్ పై రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం చిట్యాల మున్సిపాలిటీకి 15 కోట్లతో అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 12 స్థానాలను తోపాటు మున్సిపల్ చైర్మన్ కూడా కైవసం చేసుకుంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కనకదుర్గ ఆలయ చైర్మన్ మారగోని అంజనేయులు, ఎద్దుల పూరి కృష్ణ, బెల్లి సత్తయ్య, కొసనమ్ అశోక్, ఏళ్ల చంద్రశేఖర్, మల్లె బోయిన మల్లేష్ ,ఏర్పుల పరమేష్, ఎస్.కె ఇమ్రాన్, చిరబోయిన యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
