యాదవ సంఘం అభివృద్ధికి కృషి…

యాదవ సంఘం అభివృద్ధికి కృషి…

చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల పట్టణంలోని ముత్యాలమ్మ గూడెం యాదవ సంఘం నూతన అధ్యక్షులు ఏర్పుల స్వామి యాదవ్,కార్యదర్శి చింతపల్లి ప్రవీణ్ యాదవ్, కోశాధికారి మద్ది మధు యాదవ్ లు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఆదివారం రోజు యాదవ సంఘం సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవ సంఘం అభివృద్ధి కోసం సంఘం సభ్యులందరి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మెండే వెంకన్న, కౌన్సిలర్ ఏర్పుల పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply