మృతురాలి కుటుంబానికి నేతల పరామర్శ…

మృతురాలి కుటుంబానికి నేతల పరామర్శ…
చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని నవాబుపేట గ్రామ బిఆర్ఎస్ నాయకులు పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, భార్యరమ, ఇటీవలఅనారోగ్యంతో మృతి చెందారు. ఆదివారం నిర్వహించిన ఆమె దశదిన కర్మలో బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు, పాల్గొని మృతురాలి ఫొటోకు నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల మాజీ జెడ్పిటిసి గొర్రె సాగర్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు అల్లం రవీందర్, యూత్ మండల అధ్యక్షుడు తౌటం నవీన్, గ్రామ శాఖ అధ్యక్షులు సాద రాజు, మాజీ ఎంపీటీసీ జంబుల తిరుపతి, మండల నాయకులు పాండ్రాల వీరాస్వామి, నల్ల దేవేందర్ రెడ్డి, కాట్రేవుల దుర్గ ప్రసాద్, వలబోజు నరేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
