అతిగా మద్యం తాగి ఒకరి మృతి

అతిగా మద్యం తాగి ఒకరి మృతి
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం సాతంబాకం బస్టాండ్ వద్ద ఓ వ్యక్తి చనిపోయాడు. పెనుమూరు ఎస్ఐ శ్రీనివాసులు వివరాల మేరకు తమిళనాడు రాష్ట్రం గుడియాత్తం తాలూకా పార్వతీపురానికి చెందిన కుమార్ (47) సాతంబాకంలో ఇటుకలు కోస్తున్న తమ బంధువుల వద్దకు ఆదివారం వచ్చాడు.
తమిళనాడుకు చెందిన భార్య ఆయనతో గొడవపడి ఇటుక పనులకు కేరళకు వెళ్లిపోయింది. ఆ బాధలో అతిగా మద్యం సేవించారు. అదే సమయంలో ఫిట్స్ రావడంతో చనిపోయాడు.
