China spy bird | చైనా స్పై పక్షి కలకలం..

China spy bird | చైనా స్పై పక్షి కలకలం..

ఏకంగా GPS ట్రాకర్ లభ్యం


China spy bird | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : పొరుగు దేశం చైనా అవకాశం దొరికినప్పుడల్లా మన దేశంపై విషం చిమ్ముతూనే ఉంది. వ్యూహాత్మక ప్రాంతాల్లో వరుసగా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే వస్తుంది. కర్ణాటకలో చైనా (China) స్పై ఆరోపణలతో మరో కలకలం రేగింది. ఉత్తర కన్నడ జిల్లా కార్వార్‌లోని ఠాగూర్ బీచ్‌లో సోలార్ ప్యానెల్, జీపీఎస్ ట్రాకర్ అమర్చిన సీగల్ పక్షిని స్థానికులు గుర్తించడంతో భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి.

కర్ణాటకలో చైనాకు చెందిన ఓ స్పై పక్షి (spy bird) కలకలం రేపుతోంది. ఉత్తర కన్నడ జిల్లా కార్వార్‌ (Karwar)లోని ఠాగూర్ బీచ్‌లో కదలలేని స్థితిలో సీగల్ పక్షిని స్థానికులు గుర్తించారు. అనంతరం కోస్టల్ పోలీసులకు సమాచారం అందజేయగా.. వారు స్పాట్‌కు చేరుకుని సీగల్ పక్షి (Seagull Bird)ను స్వాధీనం చేసుకున్నారు.

పక్షి పైభాగంలో సోలార్ ప్యానెల్ (Solar Panel) అటాచ్ చేసి ఉన్న జీపీఎస్ ట్రాకర్‌ (GPS Tracker)ను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆ ట్రాకర్‌లో తమ పక్షి ఎవరికైనా దొరికితే మెయిల్ చేయాలంటూ చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన సందేశం ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో వివరణ కోసం ఆ మెయిల్ ఐడీని పోలీసులు, అధికారులు కాంటాక్ట్ చేస్తున్నారు.

Leave a Reply