China Manja | చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు

China Manja | చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు

  • ఎస్ఐ జి. అనిల్ రెడ్డి

China Manja | కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : నిషేధిత చైనా మాంజా అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవని కమ్మర్ పల్లి ఎస్ఐ జి.అనిల్ రెడ్డి హెచ్చరించారు. ఈ రోజు మండల కేంద్రంలోని కిరాణా షాపులు, గాలి పటాలు విక్రయించే దుకాణాలను సిబ్బందితో కలిసి ఎస్ఐ అనిల్ రెడ్డి తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదకరమైన చైనా మాంజా వాడకంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. గాలిపటాలను ఎగురవేయడానికి సాధారణ దారాలను ఉపయోగించే బదులు చైనా మాంజ దారాలను ఉపయోగించడం వలన వాహనదారులకు, జంతువులకు, పశువులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఇలాంటి సంఘటనలు పునరావృతము కాకుండా వ్యాపారులు ఎక్కడ కూడా చైనా మాంజా దారాన్ని విక్రయించరాదని అన్నారు. నిషేధిత చైనా మాంజాను కిరాణా షాపుల్లో అమ్మితే వారిపై చట్టపురమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply