China Manja | విక్రయాలపై పోలీసుల విస్తృత తనిఖీలు

China Manja | విక్రయాలపై పోలీసుల విస్తృత తనిఖీలు

  • ఎట్టి పరిస్థితిలో చైనా మాంజా విక్రయించవద్దు
  • సిఐ సుబ్బారెడ్డి , ఎస్సై చంద్రకుమార్

సుల్తానాబాద్, ఆంధ్రప్రభ : చైనా మాంజాను విక్రయిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై చంద్రకుమార్ హెచ్చరించారు. ఇవాళ‌ సుల్తానాబాద్ మండల కేంద్రంలో వివిధ దుకాణాలలో చైనా మాంజాను విక్రయిస్తున్నారా అని తనిఖీలు నిర్వహించారు.

అనంతరం మాట్లాడుతూ… అతి ప్రమాదకరమైన చైనా మాంజా ద్వారా అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గాలిపటాలు ఎగుర వేసే సమయంలో పలువురి మాంజా ద్వారా చేతులు తెగుతాయి అలాగే గాలిపటాలను ఎగురవేసి నా సందర్భంలో తెగి పడిపోయి రోడ్లపై ఉండడంతో రోడ్లపై ప్రయాణించే వాహనదారులకు బాటా చారులకు వివిధ సందర్భాలలో తగిలి తీవ్ర గాయాలపాలైన వారు ఉన్నారని అలాగే ప్రాణాలు కోల్పోయిన వారు సైతం ఉన్నారని ఎట్టి పరిస్థితిలో చైనా మాంజాను విక్రయించవద్దని విక్రయించిన వారిపై చర్యలు తీసుకుంటామని సూచించారు.

ప్రజలెవరు చైనా మాంజాను వాడవద్దని సాధారణ గాలిపటాలను మాత్రమే ఎగరవేయాలని సూచించారు ప్రజలు గమనించి సహకరించాలని ఒకరి ఆనందం మరొకరికి విషాదం కలిగించకుండా ఉండాలని ఆనందోత్సవాల మధ్య సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు వివరించారు. తనిఖీలలో ఎస్సై చంద్రకుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply