’చిన్నా ఫోన్ ఆపేసి నిద్రపో‘…. ’ఆ ఆపేస్తున్నా… టూమినిట్స్ అంతే‘… ఈ మాటలు ఇప్పుడు ప్రతిఇంట్లో ప్రతిరోజు తప్పనిసరి (Compulsory) అయిపోయాయి. ఆ రెండు నిముషాలు(Two Minutes)… రాత్రులు రెండువరకు సాగుతూనే ఉంటాయి. పిల్లల ఫోన్ స్క్రీన్ల నుండి వచ్చే వెలుతురు(Screen Light) తల్లిదండ్రులకు కూడా నిద్ర లేకుండా చేస్తోంది.
పిల్లలు ఇలా ఫోన్లకు అడిక్ట్ అయిపోతే వాళ్ల చదువు, భవిష్యత్తు, ఆరోగ్యం ఏం కావాలి అనే బెంగ లేని ఇల్లు ఇప్పుడు లేనే లేదంటే అతిశయోక్తి కాదు. రెండు మూడేళ్ల పసి పిల్లల(Children) నుండి టీనేజి (Teenageers) ఆ పై వయసున్న యువత వరకు ఏ ఇంట్లో చూసినా పిల్లలు ఎప్పుడూ ఫోన్లతోనే కనబడుతున్నారు.
స్క్రీన్ టైమ్ పెరగటం, రాత్రులు ఫోన్లు, ల్యాప్ టాప్ లతో మేలుకుని ఉండటం, పిల్లల ఆరోగ్యాన్ని, వారి పెరుగుదలని దెబ్బ తీస్తోందని ఎన్నో వైద్య పరిశోధనలు (Medical Researches) రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా పెరిగే వయసులో ఉన్న టీనేజి పిల్లలు ఫోన్లు చూస్తూ నిద్ర మేలుకుని ఉండటం వలన వారి శరీరంలో రకరకాల అనారోగ్యకరమైన(Un-Healthy) మార్పులు జరిగే ప్రమాదం ఉంటుంది.
ఆ మార్పులు వారి భవిష్యత్తు మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి.
టీనేజర్లలో గాఢ నిద్రలో ఉన్నపుడే పెరుగుదలకు సంబంధించిన గ్రోత్ హార్మోన్ (Growth Hormones) విడుదల అవుతుంది.
ప్రతి రోజూ తగినంత నిద్ర ఉంటేనే వారిలో ఎముకలు కండరాలు కణజాలంలో పెరుగుదల సజావుగా ఉంటుంది.
నిద్ర లేక పోవటం వలన వారు ఎన్నెన్ని సమస్యలు ఎదుర్కోవాలో తెలిస్తే రాత్రుళ్ళు వారిని ఫోన్లు పట్టుకోనీయరు.
1) ఏకాగ్రత లోపం(Concentration Fail)
2) మతిమరుపు( Memory Loss)
3) సమస్యలను పరిష్కరించే శక్తి తగ్గిపోవడం. (Salvation Power)
4) చదివిన విషయాలను గుర్తుంచుకునే శక్తి లోపించడం. (Memory Power)
5) చదువులో వెనుకబడడడం. (Studies)
నిద్రతో మన శరీరంలో రోగ నిరోధక శక్తి Resistance Power) పెరుగుతుంది.
నిద్రకి దూరం అవటం వలన టీనేజర్లు సీజనల్ వ్యాధులకు గురయ్యే ప్రమాదం పెరుగుతుంది.
సరైన నిద్ర లేకపోతే ఆకలికి సబంధించిన హార్మోన్లలో సమతౌల్యం లోపిస్తుంది.
దాంతో వారు అధికంగా తినటం, అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను తినటం లాంటి సమస్యల బారిన పడి ఒబేసిటీ (Obesity )కి గురయ్యే ప్రమాదం ఉంది.
సవ్యంగా నిద్ర పోయే టీనేజి పిల్లలకు తమ ఆకలిపైన అదుపు ఉంటుంది.
దాంతో అధిక బరువు సమస్య ఉండదు.
టీనేజి పిల్లలు సరిగ్గా నిద్ర పోకపోతే మొటిమలు ఇతర చర్మ సమస్యలు వేధించే అవకాశం మరింత పెరుగుతుంది.
ఒక క్రమ పద్ధతిలో సవ్యంగా నిద్ర పోతే అదే వారికి సహజమైన స్కిన్ కేర్ గా పనిచేస్తుంది.
నిద్ర శరీరాన్ని రీఛార్జ్ చేస్తుంది. టీనేజి పిల్లలు శారీరకంగా హుషారుగా ఉండాలన్నా, రోజువారీ పనులు పూర్తి శక్తి సామర్ధ్యాలతో చేయాలన్నా, ఆటలు ఆడాలన్నా వారికి మంచి నిద్ర ఉండాల్సిందే. సరైన నిద్ర లేకపోతే మెలటోనిన్, కార్టిసాల్, ఇన్సులిన్ వంటి హార్మోన్లలో సమస్యలు ఏర్పడి ఆ ప్రభావం పిల్లల మానసిక స్థితి, పెరుగుదల, మెటబాలిజంలపై పడుతుంది.
కంటి నిండా తగినంత నిద్ర లేకపోతే సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆలోచనల్లో స్పష్టత ఉండదు. ఏది మంచి? ఏది చెడు అనేది తెలుసుకోలేక తప్పుడు నిర్ణయాలు తీసుకుని అనవసర ప్రమాదాలు కొని తెచ్చుకునే ప్రమాదం సైతం ఉంది. పెరుగుతున్న పిల్లల స్క్రీన్ టైమ్ పట్ల తల్లిదండ్రులు భయపడటం బాధ పడటం జరుగుతున్నదే. కానీ ఈ సమస్యకు తగిన పరిష్కారాలను వెతకటం మరింత అవసరం.