CHILD | నిండు జీవితానికి రెండు చుక్కలు

CHILD | నిండు జీవితానికి రెండు చుక్కలు
- చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన దివి మార్కెట్ కమిటీ చైర్మన్
CHILD | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : చిన్నారులకు రెండు పోలియో చుక్కలు వేయించడం పరిపూర్ణమైన జీవితం ఇచ్చినవారమవుతామని దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలోని పోలియో కేంద్రంలో చిన్నారులకు ఆయన పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్ ఇప్పటికే పోలియో రహిత దేశంగా గుర్తింపు పొందినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలియో వైరస్ సోకితే చిన్నారులు జీవితాంతం అంగవైకల్యంతో బాధపడే ప్రమాదం ఉందని తెలిపారు. ఐదేళ్లలోపు వయసున్న చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. గతంలో వేయించినా సరే మళ్లీ వేయించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్లు తుంగల గిరి, బచ్చు కృష్ణకుమారి, తెలుగుదేశం పార్టీ నాయకులు బండే రాఘవ, బండే కనకదుర్గ, అన్నపరెడ్డి వెంకటేశ్వరమ్మ, స్థానిక వైద్య అధికారులు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
