నేడు ఆ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన సందర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌కు చేరుకుంటారు.

ఈ పర్యటనలో భాగంగా లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న లింగంపల్లికుర్దు ఆర్&బి బ్రిడ్జిని ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. అలాగే, బుడిగిడ గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను, కామారెడ్డి మున్సిపాలిటీలోని దెబ్బతిన్న రోడ్లు, జీఆర్ కాలనీని సందర్శిస్తారు. అనంతరం, కామారెడ్డి ఐడీఓసీలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను చూసి, వరద నష్టంపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ పర్యటన ద్వారా వరద బాధితులకు తగిన సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రజలకు భరోసా ఇవ్వనున్నారు.

Leave a Reply