Chief Minister | రైతులు సద్వినియోగం చేసుకోవాలి

Chief Minister | రైతులు సద్వినియోగం చేసుకోవాలి

  • ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు సూత్రాలపై అవగాహన పెంచుకోవాలి
  • జిల్లా పట్టు పరిశ్రమ శాఖ జేడీ పద్మావతి

Chief Minister | వెదురుకుప్పం, ఆంధ్రప్రభ : రైతుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు సూత్రాలపై అవగాహన చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని అని జిల్లా పట్టు పరిశ్రమ శాఖ జేడీ పద్మావతి(Jedi Padmavati) పేర్కొన్నారు. ఈ రోజు రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా వెదురుకుప్పం మండలంలో తిరుమలయ్య గారి పల్లి, ఎస్ ఆర్ పురం మండలంలో పిల్లర్ కుప్పం నందు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి(Chief Minister) లేఖను ఆవిష్కరించారు.

పట్టు రైతులందరికీ స్వయంగా ఆమె చేతులతో లేఖను అందజేశారు. రైతులను కలిసి మాట్లాడారు. రైతాంగం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీటి భద్రత ఆధారిత వ్యవసాయ సాంకేతికత వ్యవసాయం ఆహార సంస్కరణ ప్రభుత్వ మద్దతు అనే ఐదు అంశాల పై రైతులకు వివరించారు. రైతులు మొబైల్లో యాప్ ఇన్‌స్టాల్ చేసే విధానంను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె పట్టు రైతులతో మాట్లాడుతూ, రైతుల జీవనోపాధి ఆర్థిక స్థితి నైపుణ్యాభివృద్ధితో అంచనావేసి రైతుల్లో శాశ్వత మార్పు తీసుకురావడం లక్ష్యంగా ప్రభుత్వం రైతన్న ఇంటింటా మీకోసం సర్వే కార్యక్రమం చేపట్టిందన్నారు. 24 వ తేదీ నుండి 29వ తేదీ వరకు జరిగే వ్యవసాయ అనుబంధ శాఖ సిబ్బందితో ఇంటింటా సర్వే కార్యక్రమంను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

అన్నదాత సుఖీభవ అర్హులైన వారి ఖాతాల్లో జమ అయినదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రైతు సెల్ ఫోను(cell phone)లో యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలని ఇంటింటా సర్వే చేస్తున్న సిబ్బందిని ఆదేశించారు. పంటల్లో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు

వ్యవసాయ అనుబంధ శాఖాధికారులతో పాటు సెరికల్చర్ ప్రోగ్రెసివ్(Sericulture is progressive) రైతులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టు పురుగుల పెంపకంతో లభించే ఆర్థిక ప్రయోజనాలు, రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సెరికల్చర్ వివరించారు. గ్రామంలో మల్బరీ సాగుపై అవగాహన పెంపొందించే కార్యక్రమం నిర్వహించారు.

రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని మల్బరీ తోటలు, పట్టు పురుగుల షెడ్లను సందర్శించి, చలికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి రైతులకు వివరించారు.

సెరికల్చర్ అధికారులు(Sericulture Authorities) పట్టు రైతులను కలిసి అవసరమైన సూచనలు అందించారు. అనంతరం వారి మల్బరీ తోటలు, పట్టు పురుగుల షెడ్లను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ప‌ట్టు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply