తెలంగాణ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం

తెలంగాణ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం
నెన్నెల, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు నెన్నెల మండల కేంద్రంలో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సర్పంచ్ ఎండీ ఇబ్రహీం మాట్లాడుతూ.. తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని, ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఉపసర్పంచ్ కిసరి సంతోష్, మాజీ ఉపసర్పంచ్ గడ్డం స్వామి గౌడ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరాయని, ఆయన నాయకత్వం రాష్ట్రానికి శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పుదరి అంజి గౌడ్, మసూద్ ఖాన్, వెంకటేశం తదితరులు పాల్గొని కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ఆసుపత్రి రోగులకు, పాఠశాల విద్యార్థులకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు.
