వ్యవసాయ మార్కెట్లోకి పలు గ్రామాలు విలనంపట్ల హర్షం….

వ్యవసాయ మార్కెట్లోకి పలు గ్రామాలు విలనంపట్ల హర్షం….

చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండల వ్యవసాయ మార్కెట్ పరిధిలోకి చౌటుప్పల్ నుండి 11 గ్రామాలు గుండ్రంపల్లి, సుంకనపల్లి, ఏపూరు, పేరేపల్లి, ఎలిమినేడు, బొంగోని చెరువు, ఆరెగూడెం, చిన్నకాపర్తి, బోయగుబ్బ, పెద్దకాపర్తి వరకు చిట్యాల వ్యవసాయ మార్కెట్ పరిధిలోకి తేవడం పట్ల చిట్యాల మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం రైతుల పక్షాన బుధవారం ఒక ప్రకటనలో హర్షం ప్రకటించారు 2018లో రూపకల్పన చేయడం జరిగింది,

కాంగ్రెస్ ప్రభుత్వ విప్ వేముల వీరేశం కృషి తోటి ఈ గ్రామాల విలీనం సాధ్యమయ్యాయని అన్నారు. ఈ మార్కెట్ పరిధిలోకి రావడానికి సహకరించిన రాష్ట్రం ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డికి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కి చిట్యాల సర్పంచ్ కాటం వెంకటేశం ఫోరం తరఫున రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు .

Leave a Reply